అనంతపురం నగర పరిధిలో నగరపాలక సంస్థలో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొందని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం మండిపడ్డారు. కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ తో కలిసి అనంతపురం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఖాళీ స్థలం కనపడితే కబ్జా చేసే పరిస్థితి నగరంలో నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.