కళ్యాణదుర్గం: ఐపార్స్ పల్లి గ్రామంలో పోలీసులు విస్తృతంగా దాడులు, 40 లీటర్ల నాటు సారా స్వాధీనం, నలుగురు అరెస్ట్
కంబదూరు మండలం ఐపార్స్ పల్లి గ్రామంలో ఎస్సై లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు నాటు సారా విక్రేతలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 40 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నిందితులు మరోసారి దొరికితే పీ డీ యాక్ట్ లేదా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్సై లోకేష్ కుమార్ హెచ్చరించారు.