శ్రీకాళహస్తి: 99% రైతులకు నగదు జమ శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లోని రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద 99 శాతం నగదు జమైందని ఏఏవో రమేష్ రెడ్డి తెలిపారు. డివిజన్లో 27,847 మంది రైతులకు గాను రూ.18.64 కోట్లు విడుదలైందన్నారు. పొలం వారి పేరు పైన లేకపోవడం, ఎంబీసీ, వెబ్ ల్యాండ్‌కు ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో కొందరికి నగదు జమ కాలేదని చెప్పారు.