నాంపల్లి: భీమారం గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ జిల్లా :,జిల్లా కలెక్టర్, ఎస్పీలు కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే ను తనిఖీ చేశారు.మూసి నుండి ఎక్కువ నీరు విడుదల చేసినా, లేదా ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షం కారణంగా నీటి ప్రవాహం ఎక్కువైతే కాజ్ వే పై నుండి నీరు ప్రవహిస్తుందని, 20 వేల క్యూసెక్కులు మూసి నుండి వదిలినప్పుడు మాత్రమే సమస్య ఉత్పన్నం అవుతుందని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వరద ప్రవాహం ఎక్కువైనప్పుడు రహదారిని బంద్ చేసి పోలీస్ పికేట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.