జగిత్యాల: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవన్ లో 16వ రోజుకు చేరిన బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మచే అష్టాదశ పురాణ మహా యజ్ఞం
జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం ఆదివారం 16 వ రోజుకు చేరింది.ఉదయం ప్రతి ఆదివారం జరిగే సత్సంగం, లలితా సహస్ర నామ పారాయణం, విష్ణు సహస్ర నామ శ్లోకాలు, భగవద్గిత శ్లోకాలు, హారతి అనంతరం, గరుడ పురాణం నిర్వహించారు. మంచిర్యాల వాస్తవ్యులు 200 సప్తాహా లు పూర్తి చేసుకున్న బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ ఆదివారం గరుడ పురాణం లోని వివిద ఘట్టాలను వివరించారు. గరుడ పురాణం ప్రతి ఒక్కరు తప్పనిసరి వినాలని, ఈ గరుడ పురాణం వినడం వల్ల మోక్షం లభిస్తుందని వివరించారు.గరుడ పురాణంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయని...