గిద్దలూరు: కంభం మండలం ఎర్రబాలెం సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన జెసిబి, రూ. 14 లక్షలు నష్టపోయినట్లు యజమాని వెల్లడి
ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జెసిబి వాహనం దగ్ధమైంది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా జెసిబి డ్రైవరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. మార్కాపురానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి చెందిన జెసిబిని గిద్దలూరులో పనుల కోసం పంపించారు. అక్కడ పనులు పూర్తయిన అనంతరం తిరిగి మార్కాపురనికి జెసిబి ని డ్రైవర్ తీసుకు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ రోడ్డు పక్కనే జెసిబిని నిలిపి వాహనం నుంచి దిగి ప్రాణాలు రక్షించుకున్నాడు. సోమవారం ఘటన వెలుగులోకి వచ్చింది.