గంగారం: గంగారం మండలం బావురుగొండ గ్రామంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు జీరో బిల్ అందజేసిన మంత్రి సీతక్క
గృహజ్యోతి పథకంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ గ్రామంలో మంత్రి శ్రీమతి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. బావురుగొండ గ్రామంలో మంత్రి సీతక్క నర్సయ్య ఇంట్లో స్వయంగా జీరో బిల్ కొట్టి లబ్ధిదారుడికి చూపించడంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ ఇవ్వడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు మంత్రి తెలియజేశారు.