రాయికోడ్: వాగు దాటుతుండగా ప్రమాదవశత్తు నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి వీడియో
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కుస్నూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్ర పరిధిలోని కుస్నూర్ గ్రామానికి చెందిన మత్సకారుడు కృష్ణ (45) ఆదివారం సాయంత్రం రాయికోడ్ చౌరస్తా నుంచి తన సొంత గ్రామమైన కుస్నూర్ కు తన టీవీఎస్ వాహనంపై గుర్మిలా వాగు వంతెనపై నుంచి దాటుతుండగా ప్రమాదవశాత్తు వాహనంతో పాటు కృష్ణ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కొట్టుకుపోయిన వ్యక్తి గురించి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నట్లు తెలిపారు.