ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ
శేర్లింగంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ పలువురు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అన్నారు.