మేడిపల్లి: కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన యాటకల్ల నర్సయ్య అనే వ్యక్తి అకౌంట్ నుండి 1లక్షా పదమూడువేలు మాయం
కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన యాటకల్ల నర్సయ్య అనే వ్యక్తి గీతాకార్మికుడిగా పని చేస్తాడు, అయితే ఈనెల నాలుగవ తేదీన అతని ఫోన్లోని వాట్సాప్ కు యూనియన్ బ్యాంక్ ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ఏపీకే ఫైలు మెసేజ్ రాగా అతను దానిని క్లిక్ చేశాడు దీంతో అతని ఖాతా నుండి 20 దఫాలుగా మొత్తం 1,13,84 అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయి దీంతో తాను మోసపోయానని తెలుసుకొని కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, సోషల్ మీడియాలో వస్తున్న ఏపీకె ఫైళ్లను ఓపెన్ చేయవద్దని కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ ప్రజలకు తెలిపారు.