తాడిపత్రి: పెద్దవడుగూరు మండలం కాసేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై విద్యుత్ వైర్లను మారుస్తున్న అధికారులు, వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
పెద్దవడుగూరు మండలం కాసేపల్లి సమీపంలో బుధవారం 44వజాతీయ రహదారిపై విద్యుత్ హై టెన్షన్ వైర్లను మారుస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రోడ్డు పై భాగంలో ఉన్న వైర్లను మార్పు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం తలెత్తింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.