తాడిపత్రి: యాడికి లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ప్రిన్సిపాల్ హరినాథ్
యాడికి మండల కేంద్రంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు. 10, ఇంటర్, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.