కుప్పం: అక్టోబర్ 4 న టీటీడీ ఆధ్వర్యంలో బెటరాయస్వామి కొండపై శ్రీవారి కల్యాణోత్సవం
కుప్పం మండలంలోని బెటరాయ స్వామి కొండపై టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 4న శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు టిటిడి బోర్డు సభ్యుడు వైద్యం శాంతారామ్ మంగళవారం పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు సైతం టిటిడి ఆధ్వర్యంలో కల్యాణోత్సవ కార్యక్రమాన్ని కన్నులు పండువగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కుప్పంలో కడ పిడి వికాస్ మర్మత్, పికేఏం ఉడా చైర్మన్ డా. సురేష్, ఆర్డీఓ శ్రీనివాస రాజు ఆవిష్కరించారు.