పాణ్యం: కల్లూరు అర్బన్ 33వ వార్డులో స్మశాన సమస్యలపై CITU ఉపాధ్యక్షుడు సుధాకర్
కల్లూరు అర్బన్ పరిధిలోని 33వ వార్డులో సిపిఎం నాయకులు పర్యటించారు. సోమవారం కల్లూరు స్మశాన వాటికను పరిశీలించి, సమస్యలు గుర్తించారు. ముళ్ల పొదలతో నిండి ఉండటం, రాత్రి వీధిలైట్ల లోపం, తక్కువ నీటి సరఫరా సమస్యలను కమిషనర్‌కు వినతిపత్రం ద్వారా తెలియచెప్పగా, వెంటనే జెసిబి ద్వారా క్లీన్ చేయించారు. పార్టీ నేతలు కాంపౌండ్ వాల్, ఓవర్‌హెడ్ ట్యాంకు, పైప్‌లైన్, స్మశానంలో దహన సంస్కారాలకు గుంతలు తీయడానికి ప్రస్తుతం పనిచేస్తున్న వారిని మున్సిపల్ సిబ్బందిగా గుర్తించి వారికి వేతనాలు ఏర్పాటు చేయాలన్నారు.