నల్లచెరువులో బస్సుకు వేలాడుతూ విద్యార్థుల నిర్లక్ష్యపు ప్రయాణం
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద విద్యార్థులు బస్సుల్లో డోర్ల వద్ద నిలబడి వేలాడుతూ నిర్లక్ష్యపు ప్రయాణం చేస్తుండడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం ఓవర్ లోడ్ తో ప్రయాణికులను తరలిస్తున్నారని, విద్యార్థులు బస్సు ఎక్కేలోపే బస్సు ముందుకు వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు పేర్కొంటున్నారు.