పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో గడ్డం మల్లేష్, ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడాలని, పోలీసు అమరవీరుల త్యాగాలను వివరించాలని ఈ శిబిరం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రక్తదానం చేసిన వారందరికీ హెల్మెట్లను అందజేశారు. రక్తదానంపై అవగాహన, ట్రాఫిక్ నిబంధనలపై కూడా అవగాహన కల్పించారు.