మార్కాపురం: రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ లంక దినకర్ ను కలిసిన సబ్ కలెక్టర్ ఎస్ వి త్రివినాగ్,స్థానిక నాయకులు
బేస్తవారిపేట కంభం లలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ లంక దినకర్ మార్గ మధ్యలో మార్కాపురంలో ఆగారు. పంచాయతీరాజ్ అతిధి గృహంలో సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్ స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం బిజెపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం బేస్తవారిపేట కు బయలుదేరి వెళ్లారు.