నారాయణ్‌ఖేడ్: బిజెపి పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు: నారాయణఖేడ్లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపిపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టా రీతిగా మాట్లాడడం సబబు కాదని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి బిజెపి పార్టీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.