డోన్ లో ఘనంగా ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు
Dhone, Nandyal | Sep 17, 2025 ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బుధవారం డోన్‌లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా DSP శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి అన్నదానం చేపట్టారు. ప్రధాని దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ, భారత్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేస్తున్నారంటూ నాయకులు ప్రశంసించారు