పుట్టపర్తిలో గోకుల్ సాయి సూపర్ బజార్ ను తనిఖీ చేసిన జేసీ అభిషేక్ కుమార్
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని గోకులంలో ఉన్న గోకుల్ సాయి సూపర్ బజార్ను తహశీల్దార్ కళ్యాణ్, కమిషనర్ క్రాంతితో కలిసి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. సూపర్ బజార్లో జీఎస్టీ మినహాయింపుతో వస్తువులు విక్రయిస్తున్నారా, ఏయే వస్తువులపై జీఎస్టీ మినహాయింపు ఉంది అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలకు ప్రభుత్వం కేటాయించిన జీఎస్టీతో సరుకులు విక్రయించాలని సూచించారు.