నరసన్నపేట: తిలారు రైల్వేస్టేషన్లో వడదెబ్బపై ప్రయాణికులకు అవగాహన కల్పించిన హెచ్ఎస్యూ చిన్ని రాజు
వేసవి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వడదెబ్బపై ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకోవలసిన అవసరం ఉందని జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్ఎస్యూ చిన్న రాజులు తెలిపారు. మంగళవారం జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వడదెబ్బపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నంతవరకు నీటిని దగ్గర ఉంచుకోవాలని, కొబ్బరినీళ్లు తీసుకుంటూ, ఓఆర్ఎస్ కూడా వినియోగించాలని కోరారు.