జమ్మలమడుగు: కమలాపురం : పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత - మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద శుక్రవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను మరియు పరిసరాలను శుభ్రపరచారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఎం జ్యోతి, శానిటరీ ఇన్స్పెక్టర్ మధు, సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.