పాణ్యం: కల్లూరు అర్బన్ పరిధిలోని వక్కెర వాగు బ్రిడ్జి నుంచి బళ్లారి చౌరస్తా ప్లే ఓవర్ వరకు,తక్షణమే రోడ్డు నిర్మాణం కావాలి
కల్లూరు అర్బన్ పరిధిలోని ధనారెడ్డి పెట్రోల్ బంకు వక్కెర వాగు బ్రిడ్జి నుండి మహావీర్ కాలనీ బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్ వరకు సర్వీస్ రోడ్డు వేయాలని సిపిఎం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ బి.నవ్యకి వినతిపత్రం ఇచ్చారు. సోమవారం వారు మాట్లాడుతూ వాహనాలు అధిక వేగంతో రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, సర్వీస్ రోడ్డు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అన్నారు. తక్షణమే రోడ్డు నిర్మాణం కావాలని డిమాండ్ చేశారు.