కోరుట్ల: మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ పట్టణ ప్రజలకు స్వచ్ఛతాహి పై అవగాహన కల్పించారు
మెట్పల్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణోత్సవ్ స్వచ్ఛత హీసేవ 2025 కార్యక్రమంలో భాగంగా ఆశావర్కర్లు, పట్టణ ప్రజలు, మున్సిపల్ స్టాప్ గురువారం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయవద్దని, పబ్లిక్ టాయిలెట్లను వినియోగించుకోవాలని సూచించారు. మేనేజర్ వెంకటలక్ష్మి, టిపిఓ రాజేంద్రప్రసాద్ తదితరులున్నారు.