ఆర్మూర్: ఆర్మూర్ లో భారీ వర్షం రోడ్లపై ప్రవహిస్తున్న నీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోయిన వాహనాలు
ఆర్మూర్ పట్టణంలో మంగళవారం రాత్రి 7:20 కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులంతా ఇబ్బందులకు గురయ్యారు. మామిడిపల్లి చౌరస్తాలో మున్సిపల్ అధికారులు నాలాలను సరిగా ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైకి వర్షం నీరు వచ్చి రెండు ఫీట్ల మేర ప్రవహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.