జిల్లా నుండి బదిలీ అయిన కలెక్టర్ ను కలిసి ప్రత్యేకంగా అభినందించిన ప్రజా ప్రతినిధులు
Ongole Urban, Prakasam | Sep 14, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వ సాధారణ బదిలీలో భాగంగా ఒంగోలు నుండి గుంటూరుకు బదిలీ అయింది. బదిలీ అయిన కలెక్టర్ కు ఆదివారం రిమ్స్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. అయితే వీడ్కోలు సభకు హాజరుకాలేని ప్రజాప్రతినిధులు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లను కలిసి ఆమె గడిచిన 14 నెలల కాలంలో జిల్లాకు చేసిన సేవలను గుర్తు చేశారు ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే మరియు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జనసేన జిల్లా అధ్యక్షుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సాదరంగా కలిసి ఆమెను ఘనంగా సత్కరించారు