తాడిపత్రి: పొట్లూరు మండలం గోపరాజు పల్లిలో చీని చెట్లను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు, పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు
పుట్లూరు మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు చీనీ చెట్లను ధ్వంసం చేశారు. గోపరాజుపల్లిలో రైతు నడిపి నారాయణరెడ్డి తన వ్యవసాయ పొలంలో చీనీ చెట్లను సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2 ఏళ్ల వయస్సు గల చెట్లను చెట్టు మధ్యలో కాళ్లతో తొక్కి ధ్వంసం చేశారు. దాదాపు 25 చెట్లను పాడు చేసినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.