నారాయణ్‌ఖేడ్: కంగ్టి శివారులో పేకాట స్థావరం పై దాడి – 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
కంగ్టి శివారు రేకుల షెడ్డు వద్ద పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి 7 మందిని పట్టుకున్నారు. పేకాట ఆడిస్తున్న సచిన్ స్వామితో కలిపి మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి రూ.47,820 నగదు, ఆరు సెల్ఫోన్లు సీజ్ చేయగా, తర్వాత వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. మండల పరిధిలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు గమనిస్తే 8712656760, 8712656734 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. అందజేసే వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారు తెలిపారు.