పెదకూరపాడు నియోజకవర్గంలో వరదలకు రైతులు నష్టపోయారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
ఎగువ నుంచి వచ్చే వరదల వల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో వాగులు పొంగి పంటలు మునిగి రోడ్లు కొట్టుకుపోయాయని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అసెంబ్లీలో సోమవారం మధ్యాహ్నం 3:00 సమయంలో ప్రస్తావించారు. దీనివల్ల రైతులు భారీగా నష్టపోయారని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వాగులు చెరువులు పూడిక తియ్యాక పోవడం వల్లనే ఈ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులతో శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.