తాడిపత్రి: మా ఓనర్ కొడుకు నన్ను కొట్టి అవమానపరిచాడు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను: చందనలో సెల్ఫీ వీడియో విడుదల చేసిన హుస్సేన్
మా ఓనర్ బాబు కొడుకు గణేష్ నన్ను కొట్టి అవమానపరిచాడని అందుకే వ్యాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని యాడికి మండలం చందనకు చెందిన హుస్సేన్ అనే కార్మికుడు గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బాబు అనే వ్యక్తి మైన్స్ లో గత 10 సంవత్సరాలుగా కార్మికునిగా పనిచేస్తున్నానని ఈ క్రమంలో 30 వేల అప్పు ఇప్పించుకున్నానన్నాడు. అప్పును ఈనెల 15 తీర్చానన్నాడు. అప్పు తీరిపోయింది కాబట్టి ఇక పనికి రానని చెప్పానన్నారు. అయితే బుధవారం ఓనర్ బాబు కొడుకు గణేష్ కొట్టి అప్పు తీర్చాలని టార్చర్ పెట్టాడన్నారు.అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు.