జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంగళవారం మధ్యాహ్నం కొత్తపేట కార్పొరేటర్ నాయి కోటి పవన్ కుమార్ మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా కొత్తపేట డివిజన్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మేయర్ ని కోరారు. కొత్తపేట డివిజన్లో రెండు డివిజన్ గా డివైడ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.