పట్టణంలోని మిట్ట కండ్రిగ సమీపంలో రోడ్డు ప్రమాదంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉద్యోగి మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మిట్ట కండ్రిక సమీపంలో రోడ్డు ప్రమాదంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉద్యోగి మృతి చెందిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే రేణిగుంట కు చెందిన రాజ్ కిరణ్ రేణిగుంట ఎయిర్పోర్టులో ఓ ఉద్యోగిగా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఇవాళ మధ్యాహ్నం స్వంత పనుల నిమిత్తం తన స్నేహితులతో కలిసి పట్టణానికి వచ్చి తిరుగు ప్రయాణంలో మిట్ట కంటికి సమీపంలో ఓ వాహనం యూటర్న్ చేసుకున్న క్రమంలో రాజ్ కిరణ్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడకు ఢీకొనడంతో రాజకీయం అక్కడికక్కడే మృతి చెందాడు అతని స్నేహితుడు స్వల్పకాలతో ప్రాణాలతో బయటపడ్డాడు