శ్రీరంగాపూర్: తాటిపాముల గ్రామంలో వైభవంగా భజన పోటీలు నిర్వహణ
తాటిపాముల గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామ దేవాలయం ఆలయంలో శ్రీరామ భక్త బృందం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 నిమిషాలకు భజన పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి హాజరైన భజన బృందం సభ్యులు భక్తి పాటలు ఆలపించారు. విజేతలకు బహుమతులు అందజేసారు.