మోత్కూర్: బీసీ బిల్లుకు అడ్డంకులు తొలగించి స్థానిక ఎన్నికలు వెంటనే జరపాలి:సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట్ నర్సు
యాదాద్రి భువనగిరి జిల్లా: బీసీ బిల్లుకు అడ్డంకులు తొలగించి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం మోత్కూర్ మండల కార్యదర్శి గుండు వెంకట నరసిం గురువారం డిమాండ్ చేశారు. గురువారం మోత్కూరు పట్టణ కేంద్రంలోని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీలో సర్పంచుల పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల నిలిపివేయడం, వల్ల పల్లెలోని పారిశుధ్యం మంచినీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ వంటి ప్రాథమిక సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని అన్నారు.