విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలంకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రులు.
విశాఖ రాజేంద్ర నగర్ లో రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంకు సోమవారం రాత్రి 8గంటలకు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం చిత్రపటానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు పల్లా కుటుంబ సభ్యులను పరామర్శించి కాసేపు వారి యోగక్షేమాలను గురించి మాట్లాడారు.