చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
చిత్తూరు: ముద్దాయికి రిమాండ్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై తాగిన మైకంలో దాడి చేసిన మొగిలి ఈశ్వర్‌ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు., A-1 ముద్దాయి మొగిలి ఈశ్వర్‌ను న్యాయస్థానం జడ్జ్ ఉత్తర్వులు మేరకు రిమాండ్ నిమిత్తం చిత్తూరు జిల్లా జైలుకు పంపించినట్లు తెలిపారు.