అదిలాబాద్ అర్బన్: దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు, నిర్వాహకులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దుర్గామాత, శారదాదేవి అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళాకారులు అమ్మవారి విగ్రహాలకు చివరి మెరుగులు దిద్దుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు