మెంటాడ మండలంలో కుండపోతగా కురిసిన వర్షం, జలమయంగా మారిన రోడ్లు
సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో ఆదివారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. మండలంలోని జయితి, చల్లపేట, జగన్నాధపురం తదితర గ్రామాలలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఇంత భారీ వర్షం కురియడం ఇదే తొలిసారి అని గ్రామస్తులు తెలిపారు. ఈ వర్షం వరి చేరుకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు..