గోపాల్పేట: మండల కేంద్రంలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్ రావు నూతన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి తో పాటు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ అన్యాయాన్ని అరికట్టేందుకు అందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. . తన తండ్రి జర్జీవన్ రాం ఆశయాలను పుణికి పుచ్చుకున్న తాను అణగారిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చెప్పారు.