రోడ్డు విస్తరణలో మరో భవనాన్ని తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
చిత్తూరు నగరంలో రహదారి విస్తరణ పనులు మరింత వేగం పుంజుకున్నాయి.జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి పర్యవేక్షణలో, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి మార్గదర్శకత్వం మరియు కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారం మంగళవారం ఉదయం తిరుపతి రోడ్డులోని కట్టమంచి ప్రాంతంలో మరో భవనాన్ని భవన యాజమాని పూర్తి అంగీకారంతో తొలగించారు.ఈ తొలగింపు కార్యక్రమాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర గారు పర్యవేక్షించగా,టౌన్ ప్లానింగ్ టీబీపీవోలు,ప్రణాళిక సిబ్బంది,జెసిబి సిబ్బంది సమన్వయంతో 100 అడుగుల విస్తీర్ణంలో రహదారి విస్తరణకు అవసరమైన భూమిని క్లియర్ చేశారు.