కోరుట్ల నియోజకవర్గంలో వినూత్నంగా మొహర్రం వేడుకలు మత సామరస్యానికి ప్రతీక అయిన మొహర్రం వేడుకలు కోరుట్ల నియోజకవర్గంలో వినూత్న రీతిలో జరుగుతాయి. మొహర్రం సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేసే పీర్లను భక్తులు దైవంగా భావించి బెల్లం, వస్త్రాలు సమర్పించి దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీరితే వారి కుటుంబ సభ్యులు పెద్ద పులుల వేషాలు వేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా రోడ్ల వెంబడి తిరుగుతూ డప్పుచప్పుళ్ల నడుమ నృత్యాలు చేస్తారు.