పూసపాటిరేగలో వాటర్ సర్వీసింగ్ చేస్తూ విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి : కేసు నమోదు చేసిన ఎస్ఐ రామకృష్ణ
Vizianagaram Urban, Vizianagaram | Sep 16, 2025
పూసపాటిరేగ మండల కేంద్రంలో సినిమా ధియేటర్ ఎదురుగా ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్లో వాటర్ సర్వీసింగ్ చేస్తూ వెంపడాం గ్రామానికి చెందిన సతీష్ మంగళవారం మృతి చెందాడు. సతీష్ వాటర్ సర్వీసింగ్ చేస్తూ విద్యుత్ షాక్ కు గురి కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని సుందరపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందాడు. మృతుని సోదరుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పూసపాటిరేగ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.