నెల్లూరులో సీపీఎం నాయకుడు పెంచలయ్య ను దారుణంగా హత్య చేసిన గంజాయి ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ గుత్తి మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ నెల్లూరులో సీపీఎం పార్టీ నాయకుడు పెంచలయ్యని గంజాయి ముఠాకు సంబంధించిన కామాక్షమ్మ అనుచరులతో హత్య చేశారన్నారు. వారిని వెంటనే శిక్షించాలని సీపీఎం పార్టీ నెల్లూరు జిల్లాలో ఈరోజు బంద్ కు పిలుపునిచ్చిందన్నారు. బంద్ కు మద్దతుగా గుత్తిలో నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు