అసిఫాబాద్: ఆసిఫాబాద్ కలెక్టరేట్ విశ్వ కర్మ జయంతి వేడుకల్లో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో బుధవారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి,డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. విశ్వకర్మ దేవుడు అన్ని యుగాల్లో నిర్మాణ శిల్పి, సమస్త హస్తకళల ఆదిదేవుడని ఆయన పేర్కొన్నారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ ఉన్నారు.