మహబూబాబాద్: ఇండియన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి సికింద్రాబాద్ డిఆర్ఎం గోపాలకృష్ణ లను కలిసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే
ఇండియన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి, సికింద్రాబాద్ DRM గోపాల కృష్ణన్‌లను మహబూబాబాద్ MLA మురళీ నాయక్ మంగళవారం కలిశారు. మహబూబాబాద్ టూ నెక్కొండ రైల్వే స్టేషన్లను పరిశీలించడానికి వచ్చిన అధికారులను MLA కలిసి మహబూబాబాద్, కేసముద్రంలో నాలుగో నెంబర్ ఫ్లాట్ నిర్మాణం, మహబూబాబాద్ కోర్టు వైపు ఎంట్రెన్స్, మహబూబాబాద్‌లో వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కోరారు.