జమ్మలమడుగు: జమ్మలమడుగు : పట్టణంలో మొదలైన 'OG' సినిమా కోలాహలం... థియేటర్ వద్ద అభిమానుల హంగామా
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని టీఎన్ఆర్ థియేటర్ వద్ద బుధవారం మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమాకి అభిమానుల హంగామా మొదలైంది. థియేటర్ వద్ద డీజేలతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డాన్సులతో దుమ్ము రేపు తున్నారు. ఈరోజు రాత్రి 10.00 గంటల నుంచి మొదలయ్యే బెనిఫిట్ షోకు అభిమానులు, జనసేన పార్టీ నాయకులు థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది.