అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్న ఘటనలో వృద్ధుడితోపాటు ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 1033 నేషనల్ హైవే అథారిటీ వారి అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.