ఉదయగిరి: కుర్రపల్లి బీసీ కాలనీలో పీఎం కుసుమ సోలార్ ప్రాజెక్ట్ వేరేచోట ఏర్పాటు చేయాలని తహసిల్దార్ కు గ్రామస్తులు వినతిపత్రం
ఉదయగిరి మండలం, కుర్రపల్లి బీసీ కాలనీ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో పీఎం కుసుమ సోలార్ ప్రాజెక్టుకు వేరే చోట స్థలం కేటాయించాలని కాలనీవాసులు తహశీల్దార్ రామ్మోహనన్ కు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. కాలనీకి సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 161 (LP 162) ఇంటి నివేశ స్థలాలు గతంలో కేటాయించారన్నారు. అదే భూమిని సోలార్ ప్రాజెక్ట్ కేటాయించడం సరికాదని, ప్రత్యామ్నాయంగా వేరేచోట కేటాయించాలని కోరారు.