మంచిర్యాల: కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన గిరిజన సంక్షేమశాఖ డైలీవేజ్ వర్కర్లు
తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ వర్కర్స్, డైలీ వైస్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం సాయంత్రం జేఏసీ ఆధ్వర్యంలో నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, డిటిడివో కార్యాలయం ఏవోకి సమ్మె నోటిసు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హస్టల్స్ లో సుమారు 3,070 మంది డైలీవేజ్, కాంటినిజెంట్, పార్ట్ టైమ్ తదితర పేర్లతో గత 35 సం||లుగా పనిచేస్తున్నారనీ తెలిపారు.