పిఠాపురం తాను ఎమ్మెల్యేగా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వర్మ
తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. పురుహుతిగా అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు చీరలను సమర్పించారు.